ఫాదర్స్ డే సందర్భంగా, సచిన్ టెండూల్కర్ ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి గురించి ఆయన ఒక మరపు రాణి జ్ఞాపకాన్ని పంచుకున్నాడు. ఆయన ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన తండ్రి కోసం కొన్ని అందమైన పదాలను కూడా రాశాడు. మన అందరికీ కొన్ని వస్తువులు ఉంటాయని అవి టైం మెషిన్ లాగా పని చేస్తాయని సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు. ఒక పాట, ఒక మధురమైన సువాసన, ఒక ధ్వని, ఒక ఫ్లేవర్, ఇవన్నీ టైం మిషిన్స్ లాగా పనికొస్తాయి అని చెప్పుకొచ్చారు. 

తనకు కూడా అలాంటి ఒక వస్తువు ఉందని చెబుతూ తన తండ్రి చిన్నప్పుడు కూర్చునే ఒక కుర్చీని తాను ఎలా ఒక మార్చానో చూపిస్తూ ఒక ఊయలని చూపుతూ అందులో కూర్చుని ఎమోషనల్ అయ్యాడు. అందులో కూర్చుని ఊగుతూ ఉంటే అనేక విషయాలు గుర్తు వస్తూ ఉంటాయి అని తన తండ్రి తో గడిపిన అనేక మధురస్మృతులు జ్ఞప్తికి వస్తాయి అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: