టీడీపీ మాజీ మంత్రి లోకేష్ ను టార్గెట్ చేస్తూ మంత్రి  కొడాలి నాని చేసిన కామెంట్స్ మీద టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తమ అధినేత చంద్రబాబు ను, లోకేష్ లను తిట్టడానికే జగన్ కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చారని ఆయన విమర్శించారు. లోకేష్ ఇమేజ్ ఎప్పటికి తగ్గదన్న ఆయన శాసనమండలిలో నాతో పాటే 14 మంది సభ్యులు లోకేష్ కు తోడున్నారని అన్నారు. 


నాని నువ్వు బయట వాగడం తప్ప లోకేష్ ను ఏమి పీకలేవని అంటూ ఆయన కామెంట్ చేశారు. నీకు ముందు మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా చూసుకోమని ఆయన ఎద్దేవా చేశారు. ఇక ఇటీవల ఫ్యాక్ష్యన్ హత్యల నేపధ్యంలో కర్నూల్ జిల్లా వెళ్ళిన లోకేష్ అక్కడ కుక్కలు అంటూ సంభోదించడంతో పెద్ద ఎత్తున దుమారం రేగినట్టు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: