సౌతాంప్టన్ పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కి స్వర్గధామంగా కనపడుతుంది. న్యూజిలాండ్ ఒక్క స్పిన్నర్ ని కూడా తీసుకోకుండా మొత్తం స్పీడ్ బౌలర్లనే తీసుకోవడం దాదాపుగా కలిసి వచ్చింది. ముందు పది ఓవర్లు టీం ఇండియా కాస్త దూకుడుగా ఆడింది గాని తర్వాత మాత్రం పిచ్ బౌలింగ్ కి పూర్తిగా అనుకూలించింది. మన బ్యాట్స్మెన్ నిలబడ్డారు అనుకునేలోపు పడిపోవడం కంగారు పెడుతున్న అంశంగా చెప్పాలి.

రోహిత్,  గిల్, పుజారా, కోహ్లీ, పంత్ వికెట్ లు పడ్డాయి. వీరిలో ఒక్కరు కూడా అర్ధ సెంచరీ చేయలేదు. ఇప్పుడు జడేజా, రహానే క్రీజ్ లో ఉన్నారు. ఈ ఇద్దరూ అవుట్ అయితే మాత్రం జట్టు స్కోర్ పెరగడం కష్టమే. ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది టీం ఇండియా. ఆ తర్వాత అశ్విన్ ఉన్నా సరే బ్యాటింగ్ పై నమ్మకం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: