ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు పక్కా వ్యూహంతో బరిలోకి దిగినట్టుగా కనపడుతుంది. పిచ్ బౌలింగ్ కి సహకరించే అవకాశం ఉన్న నేపధ్యంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందరూ కూడా ఫాస్ట్ బౌలర్లనే తీసుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని కీవీస్ బౌలర్లు నిలబెట్టారు. పిచ్ మీద చెలరేగిపోతున్నారు. ఎక్కువ వేగంతో బంతులు విసరకుండా జాగ్రత్తగా బౌలింగ్ చేస్తున్నారు.

జేమిసన్, వాగ్నర్, గ్రాండ్ హోం, టీం సౌథీ, ట్రెంట్ బౌల్ట్ ఇలా అయిదుగురు బౌలర్లను తీసుకున్నాడు. అయితే ఇందులో గ్రాండ్ హోం బ్యాటింగ్ ఆల్ రౌండర్. టీం ఇండియా మాత్రం బౌలింగ్ లో ఇద్దరు స్పిన్నర్లకు ప్రాధాన్యత ఇచ్చింది. అయితే వారికి బ్యాటింగ్ కూడా ఉన్న నేపధ్యంలో కోహ్లీ... అశ్విన్, జడేజా మీద నమ్మకం ఉంచాడు. న్యూజిలాండ్ లో కనీసం పార్ట్ టైం బౌలర్ కూడా లేకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: