హైద‌రాబాద్‌లో ఎంఎంటీస్ రైళ్లు పునఃప్రారంభం కానున్నాయి. వ‌చ్చేవారం నుంచి ఇవి న‌డ‌వ‌నున్నాయ‌ని, ఎప్పుడ‌నేది రెండురోజుల్లో ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని రైల్వే మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. హైద‌రాబాద్ లాంటి న‌గ‌రానికి ఎంఎంటీస్ రైళ్లు న‌డ‌వ‌డం చాలా ముఖ్య‌మ‌ని, న‌డ‌పాలంటూ తాను చేసిన విజ్ఞ‌ప్తిని మ‌న్నించిన కేంద్ర మంత్రి పీయూష్‌గోయ‌ల్‌కు మ‌రో మంత్రి కిష‌న్‌రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. సామాన్య‌లు, చిరువ్యాపారులు, చిరుద్యోగులంతా త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ దూరం ప్ర‌యాణించ‌డానికి ఇవి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని, ప్ర‌జ‌లంతా కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ వీటి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని కోరారు. ఇవి కూడా కొవిడ్ నియ‌మ నిబంధ‌న‌ల మేర‌కే న‌డ‌వ‌నున్నాయ‌ని, లాక్‌డౌన్‌తో ఇవి ఆగిపోయి దాదాపు 18నెల‌ల పైనే అవుతోంద‌ని కిష‌న్‌రెడ్డి చెప్పారు. ఇప్ప‌టికైనా వీటిని న‌డ‌ప‌క‌పోతే ప్ర‌జ‌ల‌కు నాణ్య‌త‌తో కూడిన మెరుగైన ర‌వాణా సౌక‌ర్యం దూర‌మ‌వుతుంద‌ని, ఇబ్బందుల‌పాల‌వుతార‌నే ఉద్దేశంతో పునఃప్రారంభించాల‌ని కోర‌గా రైల్వేమంత్రి పీయూష్ గోయ‌ల్ వెంట‌నే స్పందించార‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag