తెలంగాణా రాష్ట్ర ఆర్టీసీ అంతర్ రాష్ట్ర సర్వీసులు పునప్రారంభం అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో రేపటి నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రాంతాలకు టీఎస్ ఆర్టీసీ బస్సులను  నడుపబోతోంది.  


ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి,  ప్రతి రోజూ ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం 6 గంటలు లోపున ఈ బస్సు సర్వీసులను  నడుపుతున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాక కర్ణాటక రాష్ట్రంలో ఉన్న లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి కూడా రేపటి నుండి ఉదయం 5 గంటలు నుండి సాయంత్రం 7 గంటల వరకు సర్వీసులు నడుపబోతున్నారు. అయితే కర్నాటకలో వారాంతంలో కర్ఫ్యూ ఉన్న కారణంగా శుక్రవారం సాయంత్రం 7 గంటల నుండి సోమవారం ఉదయం 5 గంటల వరకు బస్ సర్వీసులు అందుబాటులో ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి: