ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంచ‌ల‌న రికార్డు న‌మోదు చేసింది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఒకేరోజు ప‌దిల‌క్ష‌ల మందికి పైగా టీకాలిచ్చిన‌ట్లు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఒక్క రోజులోనే ప‌ది ల‌క్ష‌ల‌కు పైగా టీకాలు వేయాల‌ని ఏపీ  ప్ర‌త్యేకంగా టీకా డ్రైవ్ కార్య‌క్ర‌మాన్నిపెట్టుకుంది. అందులో భాగంగా ప‌దిలక్ష‌ల మందికిపైగా టీకాలివ్వాల్సి ఉండ‌గా మ‌ధ్యాహ్నం మూడున్న‌ర గంట‌ల‌కే ఆ రికార్డును దాటిన‌ట్లు అధికారులు తెలిపారు. వైద్య‌, ఆరోగ్య‌శాఖ కార్య కార్య‌ద‌ర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తిరుప‌తిలోని ఒక టీకా కేంద్రాన్ని సంద‌ర్శించారు. రాష్ట్రంలో కేసులు త‌గ్గుతున్నాయ‌ని, మూడోద‌శ‌లో పిల్ల‌ల‌పై ప్ర‌భావం ఉంటుంద‌నేదానికి ఆధార‌ల్లేవ‌ని, అది జ‌గ‌ర‌క‌పోవ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఎయిమ్స్ వైద్యులు కూడా ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నార‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏపీలో 96 ల‌క్ష‌ల మందికి మొద‌టి డోసు టీకా ఇచ్చిన‌ట్లు అనిల్ తెలిపారు. ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా బ్లాక్ ఫంగ‌స్ ఇంజ‌న‌క్ష‌న్లు, ఆక్సిజ‌న్లు, ఔష‌ధాల‌న్నీ అందుబాటులో ఉంచిన‌ట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag