తెలంగాణ ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ఎత్తేయ‌డంతో ఆర్టీసీ ఇత‌ర రాష్ట్రాల‌కు బ‌స్సు స‌ర్వీసులు న‌డ‌ప‌నుంది. హైద‌రాబాద్ నుంచి ఏపీలోని అమ‌రావ‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం త‌దిత‌ర ప్రాంతాల‌కు ఈ బ‌స్సులు న‌డ‌వ‌నున్నాయి. ఏపీలో సాయంత్రం ఆరు గంట‌ల నుంచి ఉద‌యం ఆరుగంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌టంతో ఆయా స‌మ‌యాల‌కు అనుగుణంగా బ‌స్సులు చేరుకునేలా న‌డ‌ప‌నున్నారు. ప్ర‌యాణికులు ముంద‌స్తుగా రిజ‌ర్వేష‌న్ చేయించుకొని ప్ర‌యాణించాల‌ని ఆర్టీసీ విజ్ఞ‌ప్తి చేసింది. అలాగే క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఉన్న నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా బ‌స్సులు తిప్పాల‌ని టీ ఎస్ ఆర్టీసీ నిర్ణ‌యించింది. సాయంత్రం ఆరుగంట‌ల‌కు ఏపీలో క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి రానుండ‌గా ఆ స‌మ‌యానికి బ‌స్సులు చేరుకునేలా, ఉద‌యం ఆరుగంట‌ల‌కు క‌ర్ప్యూ ముగుస్తుండ‌టంతో ఆ స‌మ‌యానికి తిరిగివ‌చ్చేలా ఆర్టీసీ ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం బ‌స్సుల‌ను తిప్ప‌నుంది. కొవిడ్ అదుపులోకి రావ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ఎత్తేసింది. జులై ఒక‌టోతేదీ నుంచి పాఠ‌శాల‌ను కూడా పునఃప్రారంభించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag