దేశంలో ఇప్పటికే కరోనా వైరస్ తో వణికిపోతుంటే కొత్త కొత్త వైరస్ లు ఎంట్రీ ఇస్తున్నాయి. కరోనా కేసులు దేశంలో ఇప్పటికీ 30 నుండి 40 వేల మధ్య రోజు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా మరణాలు వందల్లో నమోదవుతున్నాయి. ఇక తాజాగా దేశంలోకి మళ్లీ బర్డ్ఫ్లూ రీఎంట్రీ ఇచ్చింది. గతంలో బర్డ్ ఫ్లూతో ఎన్నో కోళ్లు ఇతర పక్షులు మరణించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా బర్డ్ ఫ్లూ తో ఢిల్లీ కి చెందిన 11 ఏళ్ల బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ బాలుడు చనిపోయారని వైద్యులు చెప్పారు. దాంతో ఎయిమ్స్ ఆస్పత్రి సిబ్బంది అంతా ఐశోలేషన్ లోకి వెళ్ళిపోయారు. ఇక పక్షుల నుండి ఈ వైరస్ మనుషులకు సోకితే మరణాల రేటు 60 శాతంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా గతంలో  అమెరికాలో ఒక వ్యక్తి బర్డ్ ఫ్లూతో మరణించాడు.  ఇప్పుడు తాజాగా మన దేశంలో బర్డ్ ఫ్లూ తో బాలుడు మరణించడం కలకలం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: