రేషన్ బియ్యం విషయంలో ఏపీ సిఎం వైఎస్ జగన్ కాస్త వినూత్నంగా ఆలోచించడం ఒక సమస్య అయితే ఇప్పుడు రేషన్ విషయంలో సర్వర్లు మరో సమస్యగా మారాయి. ఇంటి ఇంటికి రేషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దాని విషయంలో సరఫరా చేసే వాళ్ళు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాల్లో రేషన్ దుకాణాల్లో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు సర్వర్లు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి రేషన్ డీలర్ ద్వారా పంపిణీ చేయడం మొదలుపెట్టారు. 2 రోజులుగా సర్వర్ పనిచేయక దుకాణాల వద్ద జనం క్యూ లైన్లలో నిలబడి బియ్యమో రామచంద్రా అంటున్నారు. గంటల తరబడి నిరీక్షణ తో  ప్రజలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. లోపం ఏంటో అర్ధం కాక అధికారులు, డీలర్లు తలలు పట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: