రాజస్థాన్ రాష్ట్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3 గా నమోదయింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి నష్టం సంభవించింది అనేది ఇంకా తెలియలేదు. ఈ రోజు తెల్లవారుజామున 5:24 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్టు నేషనల్ సిస్మొలజి సెంటర్ వెల్లడించింది. ఉపరితలం నుండి 110 కిలోమీటర్ల లోతున చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించినట్టు వెల్లడించింది.

పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ స్మాలజీ సెంటర్ గుర్తించింది. ఆ తర్వాత ఈ ప్రకంపనలు కొనసాగించినట్టు నిపుణులు గుర్తించారు. మరోవైపు అదే సమయంలో ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలోను భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు పది నిమిషాలకు భూకంపం సంభవించినట్టు నేషనల్ సిస్మాలజి సెంటర్ ప్రకటించింది. మేఘాలయలోనూ పశ్చిమ ప్రాంతంలో ప్రకంపనలు నమోదైనట్టు తెలిపింది. అంతేకాకుండా రెండున్నర గంటలపాటు ఈ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4:57 నిమిషాల కు లదక్ రాజధాని లేహ్ లో భూమి కంపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: