హైదరాబాదులోని ప్రముఖులకు కార్ చిచ్చి అంటుకుంటుంది. ప్రస్తుతం చాలా మంది విదేశాల నుండి లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విదేశాల నుండి నేరుగా కార్ దిగుమతి చేసుకోవాలంటే భారీగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దాంతో ఇతర దేశాల నుండి కార్లను దిగుమతి చేసేందుకు రాయబారులను వాడుకుంటున్నారు. దానికి కారణం రాయబారులకు పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో విచ్చలవిడిగా రాయబారుల నుండి ముంబై మాఫియా విదేశీ కార్లను దిగుమతి చేస్తోంది.

విదేశాల నుండి వస్తున్న కార్లకు ముంబై నుండి మణిపూర్ లోని ఓ మారుమూల షోరూంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అలా రాయబారుల పేరుతో డబ్బులు చెల్లించడంతో పన్నులను ఎగ్గొట్టేందుకు ముంబై ముఠా ప్లాన్ చేసింది. ఏడాది కాలంగా 20కి పైగా కార్లను ఇలా కొనుగోలు చేసింది. ముంబై నుండి వస్తున్న ఎక్కువ కార్లు హైదరాబాదులోని ప్రముఖులు కొన్నట్టు అభియోగాలు ఉన్నాయి. దాంతో అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాదులో కోటి రూపాయలకు పైగా కాస్ట్లీ కార్లను కొనుగోలు చేసిన రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు పై ఆరా తీస్తున్నారు. వారిలో ముంబై ముఠా తో చేతులు కలిపి కార్లను కొనుగోలు చేసిన వారి వివరాలను సేకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: