సరూర్ నగర్ లో ఓ విద్యార్థి హైటెక్ తరహా లో పరీక్ష కాపీకి ప్రయతించాడు. ఎలక్ట్రానిక్ పరికరాలతో పరిక్ష రాసేందుకు ప్రయత్నం చేశాడు. కానీ అడ్డంగా బుక్ అయ్యాడు. హర్యానా రాష్ట్రానికి చెందిన సౌరబ్ అనే యువకుడు వాయుసేన లో ఎయిర్ మెన్ ఆన్ లైన్ పరిక్ష కోసం నగరానికి వచ్చాడు. కర్మాణ్ ఘాట్ ఎస్ఈజెడ్ పరీక్ష కేంద్రం లో పరీక్షకు హాజరయ్యాడు. చెవికి‌ రిసీవర్, బనియన్ కు ఎలక్ట్రానిక్ డివైస్ అమర్చుకుని పరీక్షకు సిద్దం అయ్యారు.

కాగా సీసీ కెమెరాల్లో పరిశీలించిన పరిక్షా కేంద్రం సిబ్బంది...సౌరభ్ కదలికలు అనుమానాస్పందంగా కనిపించడం తో చెకింగ్ చేశారు. హర్యాణా నుంచి మిత్రుల సహాకారం తో సౌరభ్ పరిక్ష రాస్తున్నట్లు పసిగట్టారు. అనంతరం సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని సౌరభ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో పైలెట్ వద్దామనుకున్నా విద్యార్థి జైలు పాలయ్యాడు. ప్రస్తుతం పోలీసులు సౌరబ్ ను విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: