ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్మీడియ‌ట్ పరీక్షల ఫలితాలపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్ర‌క‌టించారు. ఫలితాల ప్రకటనపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామ‌ని, త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని సురేష్ తెలిపారు. ప‌దోత‌ర‌గ‌తి పరీక్షల ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధ‌మ‌వుతున్నామ‌న్నారు. కొవిడ్ కార‌ణంగా ఏపీలో ర‌ద్ద‌యిన ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల కోసం రాష్ట్ర‌వ్యాప్తంగా విద్యార్థులు ఎదురుచూస్తోన్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన విష‌యం అనేక వివాదాస్ప‌ద‌మైన అంశాల‌కు దారితీసింది. ప్ర‌భుత్వం చివ‌రివ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌నే యోచ‌న‌లో ఉండ‌గా ప్ర‌తిప‌క్షాలు ర‌ద్దుచేయాలంటూ పోరాటం ప్రారంభించారు. చివ‌ర‌కు సుప్రీంకోర్టుకు విష‌యం చేర‌డం.. పొర‌పాటున ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే వారికి కోటిరూపాయ‌ల ప‌రిహారం చెల్లించ‌డంతోపాటు మేం తీసుకునే క‌ఠిన‌చ‌ర్య‌ల‌కు సిద్ధ‌ప‌డాలంటూ హెచ్చ‌రించ‌డంతో ప్ర‌భుత్వం దిగొచ్చింది. ఈ అంశంపై ఒక్క ఏపీలోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag