ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మాజీ మంత్రి మైసూరారెడ్డి ఫైర్ అయ్యారు. రాయ‌ల‌సీమ ఏపీలో అంత‌ర్భాగ‌మా కాదో సీఎం జ‌గ‌న్ చెప్పాల‌న్నారు.నీటి ప్రాజెక్టుల‌పై కేంద్రం గెజిట్ గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల‌కు గొడ్డ‌లిపెట్ట‌న్నారు.గెజిట్‌ను స్వాగ‌తించే ముందు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల గురించి ఆలోచ‌న చేయ‌లేద‌ని...రాయ‌ల‌సీమ‌ను జ‌గ‌న్ చిన్న‌చూపు చూస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల తీరువ‌ల్ల రెండు రాష్ట్రాల‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని...పోల‌వ‌రంపై ఐదు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు క‌లిసి మాట్లాడుతున్నాప్పుడు ఇద్ద‌రు సీఎంలు మాట్లాడుకోలేరా అని మైసూరారెడ్డి ప్ర‌శ్నించారు.శ్రీశైలంలో విద్యుత్ ఉత్ప‌త్తికి మూడు టీఎంసీలు మాత్ర‌మే వినియోగించాల‌ని..ఇష్టానుసారం విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తోంటే సీఎం జ‌గ‌న్ ఎందుకు మాట్లాడ‌టంలేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల‌కు ఏపీ ప్ర‌భుత్వం చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు.ప‌ట్టిసీమ ప్రాజెక్టుకు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించాల‌ని ప్ర‌తిప‌క్ష‌నేత‌గా జ‌గ‌న్ డిమాండ్ చేసింది నిజం కాదా అని ప్ర‌శ్నించారు.గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రభుత్వం ఉండుంటే.. రాయలసీమ ప్రజలకు ఇంత అన్యాయం జరిగేది కాదని..కేసీఆర్, జగన్ లు రాజకీయ లబ్ది కోసం కీచులాడుకుని  జట్టును కేంద్రం చేతిలో పెట్టారని ఆరోపించారు.ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకోకపోవటం వలనే బోర్డుల మితిమీరిన జోక్యం చేసుకుంటున్నాయ‌ని...శ్రీశైలం జలాశయాన్ని తెలంగాణ ఖాళీ చేస్తుంటే... ఆంధ్రా పాలకులు నిద్రపోతున్నారా అని మైసూరా రెడ్డి ప్ర‌శ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: