ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి... మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికీ ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలవుతూనే ఉంది. అయినప్పటికీ కేసులు మాత్రం ప్రతి రోజు 2 వేలు పైగానే పాజిటివ్ గా వస్తున్నాయి. అదే సమయంలో మూడో వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అధికారులతో రివ్యూ కూడా నిర్వహించారు. అటు తూర్పు గోదావరి జిల్లాను కరోనా భూతం వెంటాడుతూనే ఉంది. జిల్లాలోని ఆత్రేయపురం మండలంలో అధికంగా నమోదవుతుండటంతో... ర్యాలీ, ఆత్రేయపురం, పేరవరం, వద్దిపర్రు గ్రామాల్లో రేపటి నుంచి ఈ నెల 31 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు  పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు అధికారులు. మాస్క లేకుండా ఎవరైనా కనిపిస్తే... వారికి జరిమానా విధించాలని కూడా ఆదేశించారు. అటు కోనసీమ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో మరోసారి కంటైన్ మెంట్ జోన్ విధానాన్ని అధికారులు ప్రారంభించారు. పి. గన్నవరం, అల్లవరం, రాజోలు మండలాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాజోలు మండలంలోని తాటిపాక, సావరం గ్రామాల్లో అధికంగా కేసులు నమోదవుతుండటంతో కంటైన్ మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: