ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా ఉధృతి త‌గ్గ‌డంలేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,527 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైద్య, ఆరోగ్యశాఖ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం 2,412 మంది బాధితులు కోలుకున్నారు. 19 మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసులు 19,46,749కు పెరిగాయి. 19,09,613 మంది కోలుకున్నారు. మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 13,197కు చేరింది. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 23,939 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్య‌, ఆరోగ్యశాఖ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కొత్తగా నమోదైన కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో 515, చిత్తూరులో 318 కేసులున్నాయి. అలాగే ప్రకాశంలో 303, పశ్చిమ గోదావరి జిల్లాలో 288, కృష్ణా జిల్లాలో 249, నెల్లూరులో 206, గుంటూరు జిల్లాలో 182, విశాఖపట్నంలో 133, కడప జిల్లాలో 111 చొప్పున అత్యధిక‌ కేసులు నమోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 86,280 శాంపిల్స్‌ పరీక్షించారు. ఇప్ప‌టికే వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతోంద‌ని అంద‌రూ భావిస్తుండ‌గా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో ప్ర‌భుత్వం కూడా క‌ర్ఫ్యూను ఈనెల 30వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ ఉత్త‌ర్వులు జారీచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag