రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఉద్యోగులతో పాటు గ్రామ సర్పంచ్ లకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల అమలులో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా సరే...  కఠిన చర్యలు తప్పవన్నారు. ఇక గ్రామ సర్పంచ్ ల విషయంలో అయితే ఒక మోతాదు ఎక్కువే పెంచారు. జగనన్న పచ్చ తోరణం పథకం కింద రాష్ట్రంలో మొత్తం 17 వేల కిలోమీటర్ల పొడవున మొక్కలు నాటుతున్నట్లు మంత్రి  పెద్దిరెడ్డి వెల్లడించారు. ఆ మొక్కల సంరక్షణ బాధ్యత... ఆయా గ్రామ సర్పంచ్ లదే అని తేల్చి చెప్పారు. ప్రతి మొక్క బతికేలా చూడాలన్నారు. ఒక్క మొక్క చనిపోయినా... సర్పంచ్ లపై వేటు పడుతుందని పెద్దరెడ్డి  హెచ్చరించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలు అర్హులకు అందేలా చూడాల్సిన  బాధ్యత అధికారులు, ఉద్యోగులతో పాటు సర్పంచ్ లపై కూడా ఉందన్నారు. నవరత్నాలతో పాటు జగన్  సర్కార్ ఎన్నో పథకాలు అమలు చేస్తోందని... పథకాల అమలులో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దన్నారు మంత్రి పెద్దిరెడ్డి.  

మరింత సమాచారం తెలుసుకోండి: