తెలంగాణాలో కొత్త రిజిస్ట్రేషన్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో నేటి నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. అక్టోబర్ నుండి పెరిగిన భూముల విలువలు అమలులోకి వస్తాయి. రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ లో మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నూతన విధానం పై అధికారులలు సమీక్ష జరిపి కొందరి అధికారులకు ఉన్న సందేహాలను కూడా తీర్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేటి నుండి ధరలు అమలు అవుతాయని అధికారులు పేర్కొన్నారు. మొదటి రోజు నుండి ఇబ్బందులు లేకుండ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సబ్ రిజిస్ట్రార్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ఆదేశించింది. ఇప్పటికే ఫీజు చెల్లించి స్లాబ్ బుక్ చేసుకొన్న వారు అదనపు రుసుము చెల్లించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులను స్టాంపులు , రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ లో అందుబాటులో కి అధికార యంత్రాంగం తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్ చార్జీలను ఆరు నుండి 7.5 శాతానికి పెంచుతూ   ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts