5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు రైతులు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ జంతర్ మంతర్ లో రైతులు నిరసన తెలిపడానికి రెడీ అయ్యారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కు చెందిన 200 మంది గుర్తింపు కార్డులు కలిగిన రైతులకు మాత్రమే ధర్నా చేయటానికి అనుమతి ఇచ్చారు ఢిల్లీ పోలీసులు.

ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జంతర్ మంతర్ సమీపంలోని పార్లమెంట్ స్ట్రీట్ రోడ్డులో ధర్నాకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూలై 22 నుండి ఆగష్టు 9 వరకు శాంతియుత పద్ధతులలో కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ధర్నా చేయడానికి అధికారులు అనుమతి ఇచ్చారు.  అంతే కాకుండా రైతుల నుండి రాతపూర్వక హామీ కూడా తీసుకున్నారు. రైతులు ధర్నా చేస్తున్న నేపధ్యంలో భారీ నిఘా పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp