నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ జలాశయం లో అరుదుగా కనిపించే నీటి కుక్కలు దర్శనమిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నాగార్జునసాగర్ జలాశయం లోకి ఎగువ నుండి నీటి ప్రవాహం వస్తోంది. దాంతో నీటి కుక్కలు రిజర్వాయర్ లోని వాటర్ స్కెల్ సమీపంలో కనిపిస్తున్నాయి. నీటి కుక్కలు నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకుని జీవిస్తాయని తెలుస్తోంది. ఇవి నీటిలో చేపలను ఆహారంగా తీసుకుని బతుకుతాయి అంతే కాకుండా బయట కూడా ఇవి జీవించగలిగవు.

ఇదిలా ఉండగా నీటి కుక్కల జాతి చాలావరకు కనుమరుగైంది. ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. దాంతో వీటిని సంరక్షిం చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇక వర్షాలు భారీగా కురుస్తుండడంతో నాగార్జునసాగర్ ప్రాంతంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారడం వల్ల ఎంతోమంది సందర్శకులు జలాశయం వద్దకు చేరుకుంటున్నారు. అంతేకాకుండా సందర్శకులు నీటి కుక్కలను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: