ఓవైపు కరోనాతో ప్రజలు భయపడి పోతుంటే మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రజలపై దాడి చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో డెంగ్యూ కలకలం రేపుతోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు వచ్చిన వారి సంఖ్య 36 కు చేరుకుంది. అయితే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో కలిపి ఈ సంఖ్య రెట్టింపుగా ఉండవచ్చు అని అధికారులు భావిస్తున్నారు. రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

జ్వరంతో బాధ పడుతున్న ప్రతి ఒక్కరికీ ఎలీషా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు జిల్లాలో వందల సంఖ్యలో డెంగ్యూ కేసులు వస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదని విమర్శలు వస్తున్నాయి. కాగా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం మలేరియా, డెంగ్యూ కేసులు నమోదవుతుట్టు అధికారులు గుర్తించారు. కొన్ని గ్రామాల్లో దోమ తెరలను ప్రజలకు అందించారు. అంతేకాకుండా గోడలకు దోమల మందు పిచికారి చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇవన్నీ గత ఏడాది చేశారని ఈ ఏడాది ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap