మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఏలూరు ఎన్నికలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఏలూరులో ఎన్నికలకు సంబంధించి ఉన్న లోపాల కారణంగా ఎన్నికల కౌంటింగ్ ని వాయిదా వేయగా... ఇప్పుడు ఏలూరు మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల కౌంటింగ్ ను ఈనెల 25 న నిర్వ‌హించాల‌ని  రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణయం తీసుకుంది. దీనికి సంభందించి నేడు నోటిఫికేష‌న్ ను ఎన్నిక‌ల సంఘం కార్య‌ద‌ర్శి కె క‌న్న‌బాబు విడుదల చేసారు.


మార్చి 10 న ఏలూరు మున్సిప‌ల్ కార్పోరేష‌న్ కు ఎన్నిక‌లు జ‌రిగాయాంటూ ఎస్ఈసి పేర్కొంటూ కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో కోవిడ్ నిభంద‌న‌లు ప‌క్కాగా పాటించాల‌ని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. పోటీచేసిన వారు త‌మ కౌంటింగ్ ఏజెంట్ల‌ను నియామ‌కానికి ఈ నెల 24 సాయంత్రం 5 గంట‌ల్లో గా సూచించిన ఫార్మెట్  ప్ర‌కారం ధ‌ర‌ఖాస్తుల‌ను రిట‌ర్నింగ్ అధికారికి అందించాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: