బిజెపి నేత మాజీ మంత్రి చంద్రశేఖర్ తెరాస ప్రభుత్వం అలాగే ఆ పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ గా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేసారు, రాజకీయంగా కేసీఆర్  దిగజారి ప్రవర్తిస్తున్నాడన్న ఆయన కరోనాతోనో, యాక్సిడెంట్ లోనో ఎమ్మెల్యేలు చనిపోతే బాగుండని ప్రజలు భావిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఉప ఎన్నికలు వస్తే తప్ప నియోజకవర్గాలు అభివృద్ధికాని పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చారు అని ఆయన విమర్శించారు.


ఉప ఎన్నిక కోసమే దళిత బంధు పథకం తీసుకొచ్చామనటం రాజకీయ  దిగజారుడుతనమే అన్నారు చంద్రశేఖర్. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ దళిత ముఖ్యమంత్రి, మూడెకాల భూమి హామీల మాదిరి దళిత బంధు కాకూడాదని కోరుకుంటున్న  అంటూ విజ్ఞప్తి చేసారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిశాక దళిత బంధును కేసీఆర్ అటకెక్కిస్తాడు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.  రాజకీయంగా ప్రమాదంలో ఉన్నప్పుడే  కేసీఆర్ కు దళితులు గుర్తొస్తారు అని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp