ప్రభుత్వాలు అప్పుచేయడం ఏ మాత్రం తప్పుకాదన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. అయితే చేసిన అప్పులకు సంబంధించిన అన్ని వివరాలు కూడా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర చేసిన అప్పులకు సంబంధించిన ఎలాంటి వివరాలు అందుబాటులో లేవన్నారు. అసలు ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో కూడా సమగ్రంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేదని పుస్తకంలో ఎక్కడా రాయలేదన్నారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల. బ్యాంకులేమో గ్యారంటీలు ఉన్నాయంటున్నాయి... అసలు బ్యాంకులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం వివరాలు కేంద్రం, ఆర్బీఐ, సభల దృష్టికి తీసుకువచ్చారా అని రాష్ట్ర ఆర్థిక శాఖను ప్రశ్నించారు. సార్వభౌమాధికారం ద్వారా వచ్చే రక్షణను కూడా వదులుకుంటామని సంతకం పెట్టారన్నారు పయ్యావుల కేశవ్. అప్పులిస్తే చాలు.... ఎక్కడైనా.. ఏ సంతకమైనా పెడతామన్నట్లుగా ఒప్పందాలు ఉన్నాయని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రశ్నలకు ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: