ఆర్టీసీ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. వరంగల్ వన్ డిపో బస్ ... జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బస్టాండ్ దగ్గరకు వస్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని డ్రైవర్ ముందే గుర్తించడంతో... ప్రయాణికులు బస్సు నుంచి దిగేసి ప్రాణాలు దక్కించుకున్నారు. హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్నసూపర్ లగ్జరీ బస్సు అగ్నికి పూర్తిగా ఆహుతైంది. బస్టాండ్ దగ్గరకు వస్తున్న సమయంలో బస్సు మోషన్ అందుకోవడం లేదని డ్రైవర్ గుర్తించాడు. అనుమానంతో పరిశీలించడంతో బస్సు ఇంజన్ లో నుంచి పొగలు రావడం గుర్తించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఇంజన్ లో చెలరేగిన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తాన్ని కమ్మేసింది,. స్టేషన్ ఘన్ పూర్ లో ఫైర్ ఇంజిన్ లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు స్ధానికులు నానా పాట్లు పడ్డారు. అప్పటికే బస్సు పూర్తిగా తగలబడి పోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఓ వైపు జోరుగా వర్షాలు కురుస్తున్న సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలాంటి ప్రమాదాలు తరచూ వేసవి కాలంలో జరుగుతూ ఉంటాయి. బస్ మెయింటనెన్స్ సరిగ్గా లేక ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: