తెలంగాణలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈరోజు రేపు కూడా తెలంగాణలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు హైదరాబాదులో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఏపీలో రాబోయే 24 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్ర లలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు అన్నీ నిండిపోయాయి. దాంతో  గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. దాంతో ప్రాజెక్టులకు సరిహద్దుగా ఉన్న గ్రామాలు లోకి వరద చేరి జలమయం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: