ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి భారీగా వరద నీరు చేరుతుంది. దాంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక ఇప్పటికే భద్రాచలం వద్ద 43 అడుగుల వరకు నీటిమట్టం చేరింది. దాంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లను వినియోగించుకోవాలని చెప్పారు. సహాయం కోసం 08744-241950, 08743-232444 అనే నంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు పోలవరం కు కూడా వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలకు దాదాపు అన్ని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దాంతో ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వాగులు వంకలు కూడా పొంగిపొర్లుతున్నాయి. ఇప్పుడు మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: