తెలంగాణా ఐటి శాఖా మంత్రి కేటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణా వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. చెప్పడం కూడా ఆమె కాస్త భిన్నంగా చెప్పారు. కేసీఆర్ గారి కొడుకు కేటిఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఆమె తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు .. నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపె హృదయాన్ని అదే విధంగా...


రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదలను 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఇచ్చె మనసుని.. ఇవ్వాలని కోరుకొంటున్నాను అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఇటీవల  మీడియా సమావేశంలో తనకు కేటిఆర్ ఎవరో తెలియదు అంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: