భారీ వర్షాలు పడుతున్న నేపధ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరదల దెబ్బకు ప్రజలు కంగారు పడుతున్నారు. జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు కు వరద భారీగా వస్తుంది. హైదరాబాద్ లోనే రెండవ అతి పెద్ద చెరువుగా ఉన్న ఫాక్స్ సాగర్ కు రెండు రోజుల నుంచి భారీగా వరద వస్తుంది. దీనితో చెరువు కింద ఉన్న కాలనీ వాసులు అందరూ కంగారు పడుతున్నారు. గతేడాది అక్టోబర్ లో కురిసిన వర్షానికి మూడు నెలల పాటు నీటిలోనే ఉమామహేశ్వర కాలనీ ఉండటం తో మళ్ళీ ఆ పరిస్థితి వస్తుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


సుభాష్ నగర్, జీడిమెట్ల, షాపూర్ నగర్ కాలనీ వాసులు క్షణం ఒక యుగంగా గడుపుతున్నారు. ఫాక్స్ చెరువు ప్రస్తుత నీటి మట్టం 30 అడుగులు ఉండగా ఇంకా చెరువులోకి నీరు చేరితే ప్రమాదం కచ్చితంగా ఉంటుంది అని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: