తెలంగాణ ఐటీ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ సంతోష్ కుమార్ కేటీఆర్ చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. దానికి కారణం ఈ ఫోటో లో కేటీఆర్ బుజ్జి కేటీఆర్ లా కనిపిస్తున్నారు.

బ్లాక్ అండ్ వైట్ రంగులో ఉన్న కేటీఆర్ చిన్న నాటి ఫోటో చాలా క్యూట్ ఉండటం తో అభిమానులు టిఆర్ఎస్ కార్యకర్తలు ఫోటో షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా విజృంభణ నేపథ్యంలో కేటీఆర్ పుట్టినరోజు కు దూరంగా ఉన్నారు. తన అభిమానులు కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పేందుకు... తనను కలిసేందుకు హైదరాబాద్ కు రాకూడదని కోరారు. అంతేకాకుండా పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పథకం కింద వికలాంగులకు స్కూటీ లను అందజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: