ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మరో 3.72 లక్షల కొవిడ్ టీకా డోసుల‌ను కేంద్రం స‌ర‌ఫ‌రా చేసింది. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఈ కొవిషీల్డ్ టీకా డోసులను చేర‌వేశారు . ఢిల్లీ నుండి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో 31 బాక్సుల్లో ఈ టీకా డోసుల‌ను చేర‌వేశారు . మొద‌ట‌ గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు ఈ వ్యాక్సిన్ డోసుల‌ను తరలించారు . 

అనంత‌రం అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో రాష్ట్రంలోని జిల్లాలకు వ్యాక్సిన్ డోసుల‌ను త‌ర‌లిస్తున్నారు . ఇక తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం ల‌భించే అవ‌కాశం ఉంది . ఇదిలా ఉండ‌గా ఏపీలో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతంగా జ‌రుగుతోంది. స్పెష‌ల్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ల‌ను నిర్వ‌హించి మ‌రీ వ్యాక్సిన్ ల‌ను ఇస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: