ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస్‌కి అమరావతి రైతుల సెగ గ‌ట్టిగా త‌గిలింది. తాళ్లాయపాలెం శివస్వామి ఆశ్రమానికి ఈరోజు మంత్రి వ‌చ్చారు. ఈ విష‌యం తెలుసుకున్న రైతులు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. రాజ‌ధానిలో నిర్మించ‌బోతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కుదించడంపై రైతులు మండిప‌డ్డారు. వెల్లంపల్లి శ్రీ‌నివాస్ మంత్రి అయిన త‌ర్వాతే ఏపీలోని ఆల‌యాల‌పై దాడులు పెరిగాయంటూ నినాదాలు చేశారు. ఆల‌య నిర్మాణం కుదింపుతోపాటు త‌మ స‌మ‌స్య‌ల‌పై విన‌తిప‌త్రం ఇవ్వ‌బోగా తీసుకోవడానికి ఆయ‌న నిరాక‌రించారు. దీంతో రైతులంతా మినిస్టర్ డౌన్ డౌన్, ప‌ద‌వికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. రాజ‌ధాని గ్రామాల్లో ఒక‌టైన వెంక‌ట‌పాలెంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో గ‌త ప్ర‌భుత్వం భారీగా ఆల‌య నిర్మాణానికి పూనుకుంది. ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత దాని ప‌రిధిని కుదించ‌డంతోపాటు బ‌డ్జెట్‌ను కూడా కుదించారు. దీనిపై రైతుల‌తోపాటు ప్ర‌జ‌లంతా ప్ర‌భుత్వానికి విన్న‌వించిన‌ప్ప‌టికీ ఎటువంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ఈరోజు తాళ్లాయ‌పాలెం శైవ‌క్షేత్రానికి చేరుకున్న మంత్రికి వ్య‌తిరేకంగా రైతులంతా నినాదాలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag