ఢిల్లీ నుంచి గ‌వ‌ర్న‌ర్‌కు ఫోన్ వ‌చ్చింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈరోజు ఫోన్‌చేసి వ‌ర‌ద న‌ష్టం వివ‌రాలు తెలుసుకున్నారు. వర్షాలు, వరదల వల్ల మ‌హారాష్ట్రలో ప్రాణ, ఆస్తి నష్టంపై రామ్‌నాథ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
వరద బాధితుల సహాయం కోసం చేప‌డుతున్న స‌హాయ కార్యక్రమాల గురించి గ‌వ‌ర్న‌ర్ కోషియారీ రాష్ట్రపతికి వివ‌రించి చెప్పారు.  మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా, మహద్‌లో కొండచరియలు విరిగిపడిన సంగ‌తి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్ప‌టివ‌ర‌కు 44 మంది మృతదేహాలను వెలికి తీయ‌గా, ఇంకా స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. గాయపడినవారిలో 35 మందికి చికిత్స అందిస్తూ స్వ‌ల్ప‌గాయాలైన‌వారిని ఇంటికి పంపించారు. మహారాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్ వడెటివార్ పూర్తి వివ‌రాల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు, మీడియాకు వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో భారీవ‌ర్షాల‌వ‌ల్ల 136 మంది మృత్యువాత ప‌డ్డార‌ని, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో ప్రాణాలు కోల్పోయిన‌వారికి ప్ర‌భుత్వం రూ.5 లక్ష‌ల చొప్పున న‌ష్ట‌ప‌రిహారం ఇస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన సంఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag