మాజీ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియో ల వ్యవహారం కాస్త సంచలనం అయింది. ఈ విషయంలో ఆయన సతీమణి శిల్పా శెట్టిని కూడా పోలీసులు విచారించగా తన భర్తకు ఏ పాపం తెలియదని ఆమె స్పష్టం చేసారు. రాజకీయంగా కూడా ఇది కాస్త హాట్ టాపిక్ అవుతుంది. ఇందులో రాజకీయ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి.

ఇక రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు కాస్త గట్టిగా బిగుసుకుంటుంది. కీలక ఆధారాలు సేకరించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు... త్వరలో మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. రాజ్‌కుంద్రా నివాసంలో భారీగా వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. 122 సినిమాల నిర్మాణానికి 9 కోట్ల ఒప్పందం చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. వాట్సాప్‌ చాటింగ్‌ లిస్ట్‌ను పరిశీలిస్తున్న పోలీసులు... త్వరలోనే మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: