గుంటూరులోని రోడ్ల‌పై టీడీపీ నేత మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు వ‌రినాట్లు వేశారు.గత ప్రభుత్వం హయాంలో వేసిన రోడ్లు తప్ప ఈ ప్రభుత్వం ఎక్కడా రోడ్లపై రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్లు ప్రయాణానికి వీలు లేకుండా తయారయ్యాయ‌ని...సంక్షేమం పేరిట అభివృద్ధిని విస్మరించారన్నారని మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ఆరోపించారు.గతంలో బిల్లులు చెల్లించకపోవడంతో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదని ప్రత్తిపాటి అన్నారు.బిల్లులు చెల్లిస్తే ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుందని...సంక్షేమం పేరుతో ప్రభుత్వం సంక్షోభం సృష్టిస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు డొల్లతనంగా ఉన్నాయని సంక్షేమం కంటే ప్రజలపై వేసే పన్ను భారమే ఎక్కువగా ఉందని ప్రత్తిపాటి పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..వ‌ర్షాకాలం వ‌స్తే చాలు న‌గ‌రంలో రోడ్ల‌న్నీ వ‌ర‌ద నీటితో నిండి ప్ర‌జ‌లు వెళ్లేంద‌కు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు.త‌క్ష‌ణం ప్ర‌భుత్వం రోడ్ల‌ను మ‌ర‌మ్మ‌త్తులు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: