వైయస్ వివేకా హత్య కేసు కు సంబంధించిన కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం వివేక ఇంట్లో పనిచేసే వాచ్ మెన్ ని అరెస్ట్ చేయగా అతడు కొంతమంది అనుమానితుల పేర్లు బయట పెట్టాడు. ఈ అనుమానితుల జాబితాలో ఉన్న కొందరు ప్రస్తుతం హైకోర్టు ఆదేశం హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు సునీల్ కుమార్ యాదవ్. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు మరో నలుగురు కూడా ఈ కేసులో అనుమానితులుగా ఉన్నారు. ఢిల్లీ నుంచి తమకు సీఆర్పీ 160 నోటీస్ రావడంతో అక్కడకు వెళ్లానని, కానీ అక్కడ తన అనుమతి లేకుండా తన పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అలాగే లైడిటెక్టర్ టెస్టులు కూడా చేశారని తన పిటిషన్లో పేర్కొన్నాడు సునీల్ కుమార్. ఒకవేళ తనను విచారించాలని సీబీఐ భావిస్తే తన న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని కూడా పేర్కొన్నాడు. ఈ పిటిషన్ సోమవారం రోజు విచారణకు జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: