వైయస్ జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఆంధ్ర ప్రదేశ్ లో  ప్రైవేట్ ఎయిడెడ్,  ప్రభుత్వ డిగ్రీ కాలేజీల లో 719 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ సేవలను అందిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వం  తీసుకున్న ఈ నిర్ణయం  పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2021 - 22  విద్యా సంవత్సరానికి గానూ వారి సేవలను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. జూన్ 2021 నుంచి ఒక పది రోజుల పాటు విరామం తీసుకొని ఆ తర్వాత వారి విధుల్లో కొనసాగుతారని విద్యాశాఖ తమ ఉత్తర్వుల్లో వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: