కరోనా టీకాల కొరత దేశం మొత్తం వేధిస్తుంది. అందులోనూ ఇప్పటికే మొదటి టీకా తీసుకున్న వారు రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏపీకి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఏపీకి మరో 11.76 లక్షల కొవిడ్ టీకా డోసులు వచ్చేశాయి. పుణెలోని సీరం సంస్థ నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఈ కొవిషీల్డ్ టీకా డోసులు వచ్చేశాయి.


ఢిల్లీ నుంచి  వచ్చిన విమానంలో 98 బాక్సుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టీకా డోసులు వచ్చాయి. గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి ఈ వ్యాక్సిన్లు తరలించారు. త్వరలో ఈ వ్యాక్సిన్‌ డోసులను జిల్లాలకు అధికారులు తరలించనున్నారు. ఈ కొత్త టీకాల రాకతో రాష్ట్రంలో నెలకొన్న టీకాల కొరత నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రాలు టీకాలు ఇచ్చే సామర్థ్యం ఉన్నా కేంద్రం నుంచి డోసులు రాక చాలా రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: