గత కొంతకాలంగా విమానాశ్రయాల్లో బంగారం అక్రమ అక్రమ రవాణా చేస్తున్న నిందితులు పట్టుబడుతున్నారు. తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా బంగారం దొరికింది. దుబాయ్ నుండి వస్తున్న ప్రయాణికుల వద్ద నాలుగు కోట్లకు పైగా విలువ చేసే 8.17 కేజీల బంగారం అధికారులకు దొరికింది. దాంతో వెంటనే అధికారులు బంగారాన్ని సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారుల ను బురిడీ కొట్టించేందుకు కేటుగాళ్లు ఓ పథకం వేశారు.

గృహోపకరణాలు, వంట సామాగ్రి లో బంగారం అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించారు. కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడం తో తనిఖీ చేయగా బండారం బయట పడింది. రైస్ కుక్కర్ ,జూసర్ నెబ్యులైజర్ లతో వస్తున్నట్టు కేటుగాళ్లు బిల్డప్ ఇచ్చారు. వాటిని తనిఖీ చేయగా అందులో బంగారం బయటపడింది. ఇక ఇందులో బయటపడ్డ ఎనిమిది కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: