సాధారణంగా ఏదైనా వస్తువు దొరికితే దానిని తిరిగి ఇవ్వడానికి అస్సలు ఇష్టపడరు. పరుల సొమ్ము పాము వంటిది అని తెలిసినా దొరికింది బంగారంలా కళ్ళకు అద్దుకుని దాచుకుంటారు. నిజాయితీగా తమకు దొరికింది పోగొట్టుకున్న వారికి చాలా తక్కువ మంది ఇస్తుంటారు. కానీ తాజాగా ఓ వ్యక్తి 27 లక్షల విలువ చేసే బంగారం నిజాయితీగా పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. బంగారం పని చేసే దుర్గారావు శ్రీకాకుళం నుండి బస్సులో వస్తుండగా బంగారాన్ని మర్చిపోయాడు.

బస్సు నుంచి దిగిపోయిన తర్వాత దుర్గారావుకు బంగారం మర్చిపోయినట్టు గుర్తుకు వచ్చింది. దాంతో వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. కాగా బస్సులో బాధితుడు మర్చిపోయిన బంగారం పోలి రాజు నాయుడు అనే వ్యక్తికి దొరకడంతో అతడు పోలీసుల వద్దకు వెళ్లి అందజేశాడు. దాంతో నిజాయితీ చాటుకున్న పోలి రాజు నాయుడు అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ డిసిపి సురేష్ బాబు అభినందించారు. బంగారం పోగొట్టుకున్న దుర్గారావు పోలినాయుడు కు కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: