తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్ డోసులు రాష్ట్ర అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మొదలు జీహెచ్ఎంసీ పరిధిలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వడం నిలిపివేస్తున్నట్లు గా సమాచారం అందుతోంది. రెండో డోస్ తీసుకోవాల్సిన వారి సంఖ్య అంతకంతకూ పెరిగి పోవడం కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో టెన్షన్ పెడుతోంది.

ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది సెకండ్ డోస్ కోసం  వెయిటింగ్ లో ఉన్నారు. అయితే ఒక్కో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కేవలం 50 మందికి మాత్రమే టీకా వేస్తున్నారు. ఈ క్రమంలో రెండో డోస్ కోసం రోజుల తరబడి వ్యాక్సినేషన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న ప్రజలు తమకు ఎప్పుడు వ్యాక్సిన్ అందుతుందా అనే విషయం మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: