రాహుల్‌గాంధీ ఈరోజు ట్రాక్ట‌ర్ న‌డిపి నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు నిర‌స‌న తెలియ‌జేశారు. రైతుల సందేశాన్ని పార్ల‌మెంటుకు తీసుకురావాల‌నే ఉద్దేశంతోనే ఈ నిర‌స‌న తెలియ‌జేశాన‌ని, రైతుల గొంతుల‌ను ప్ర‌భుత్వం అణచివేస్తోంద‌ని మండిప‌డ్డారు. న‌ల్ల‌చ‌ట్టాల‌ను ర‌ద్దుచేసేంత‌వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆప‌ద‌ని రాహుల్ స్ప‌ష్టం చేశారు. కేవ‌లం ఇద్ద‌రో, ముగ్గురో పారిశ్రామిక‌వేత్త‌ల‌కు మేలు చేకూర్చేలా ఉన్న వీటిని ర‌ద్దుచేయాల‌ని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలతో రైతులు సంతోషంగా ఉన్నారని, నిరసనగా చేసేవారిని ఉగ్రవాదుల‌ని ప్రభుత్వం చెబుతోంది. వాస్త‌వానికి రైతుల హ‌క్కుల‌ను కేంద్రం హ‌రించివేస్తోందన్నారు. వివాదాస్ప‌దంగా మారిన మూడు వ్య‌వ‌సాయ‌చ‌ట్టాల‌ను వెంట‌నే ర‌ద్దుచేయాల‌న్నారు. ట్రాక్ట‌రు క‌వాతుపై ఢిల్లీ పోలీసులు క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకున్నారు. ర‌ణదీప్ సూర్జేవాల‌తోపాటు మ‌రికొంద‌రు కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను అరెస్ట్ చేవారు. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో దేశ‌వ్యాప్తంగా త‌ర‌లివ‌చ్చిన రైతులు మూడు నెల‌లుగా కేంద్ర నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలియ‌జేస్తోన్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని ప్ర‌తిప‌క్ష‌పార్టీల‌న్నీ వీరికి మ‌ద్ద‌తు తెలియ‌జేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag