గోవా సర్కారు కరోనా నియంత్ర‌ణ‌కు అమలు చేస్తున్న కర్ఫ్యూను ఆగస్టు 2వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గోవాలో మే 9 నుంచి కర్ఫ్యూ అమ‌ల్లో ఉంది.  అప్ప‌టి నుంచి దఫదఫాలుగా ప్ర‌భుత్వం పొడిగిస్తూ వ‌స్తోంది. ఈ నేపధ్యంలో కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. ఆగ‌స్టు రెండు వ‌ర‌కు క‌ర్ఫ్యూను పొడిగిస్తున్న‌ట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. అక్క‌డ కొత్తగా 75 కేసులు నమోద‌వ‌గా, ఆరుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ ఔషధ దుకాణాలకు, మెడికల్ సంబంధిత కార్యకలాపాల నిర్వహణకు, నిత్యావ‌స‌రాల‌కు కర్ప్యూ నుంచి ప్ర‌భుత్వం మిన‌హాయింపునిచ్చింది. 50 శాతం సిట్టింగ్ సామర్థ్యంతో రెస్టారెంట్లు తెరుచుకోవ‌డానికి అనుమ‌తివ్వ‌డంతోపాటు ప్రేక్షకులు లేకుండా స్పోర్ట్స్ స్టేడియంలు తెరుచుకోవ‌డానికి కూడా గోవా ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చింది. క‌రోనా మూడోద‌శ వ‌స్తుంద‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్టుదిట్టంగా నియంత్ర‌ణ చ‌ర్య‌లు అమ‌లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag