పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. పవన్ ప్రస్తుతం మళయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీసు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. సినిమాకు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈ రోజు తిరిగి ప్రారంభమైంది. కరోనా నిబంధనలు పాటిస్తూ చిత్ర యూనిట్ షూటింగ్ ను ప్రారంభించింది.

కాగా తాజాగా ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ లుక్ ను నిర్మాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ పోలీస్  డ్రెస్ లో కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో చాలా సినిమాల్లో పోలీస్ గెటప్ వేసిన సంగతి తెలిసిందే. అయితే గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎస్సై పాత్రలో నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమాలో ను పవన్ గబ్బర్ సింగ్ లాంటి గెటప్ లోనే కనిపిస్తున్నాడు. దాంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అన్న మళ్లీ యూనిఫామ్ వేశాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఈ ఫోటోను సోషల్ మీడియాలో ఫోటోను ట్రెండ్ లోకి తీసుకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: