రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఇది చోటు చేసుకోవడం విశేషం. సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన నిమిత్తం ఓ ఆసుపత్రి గేటు ముందు కానిస్టేబుల్ కు డ్యూటీ వేశారు. అక్కడ ఆ కానిస్టేబుల్ కు, లేడీ ఎస్ఐకు మధ్య జరిగిన వాగ్వాదం కాస్తా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గేటు ముందు ఉన్న కానిస్టేబుల్ ఆసుపత్రి లోపలి ఎలాంటి వాహనాలు రాకుండా చూసుకునే బాధ్యతను అప్పగించారు. అయితే ఓ విఐపి వెహికిల్ ను ఆసుపత్రిలోని అనుమతించాలంటూ లేడీ ఎస్.ఐ అతడిని ఆదేశించింది. 

కానీ అతను ససేమిరా అన్నాడు. విఐపి అయితే ఏంటి ? సామాన్యులైతే ఏంటి ? అందిరికీ ఒకే రూల్. నేను వాళ్ళను లోపలి అనుమతించను అని కానిస్టేబుల్ మొండికేశాడు. దీంతో ఆసుపత్రి ముందు మహిళ ఎస్.ఐ.కి. కానిస్టేబుల్ కు మద్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆ కానిస్టేబుల్ నా డ్యూటీ కూడా మీరే చెయ్యండి అంటూ వెళ్ళిపోయాడు. దీంతో తెల్లబోవడం ఆ ఎస్ఐ వంతు అయ్యింది. అసలే నిజాయితీగా ఉండే పోలీసులు చాలా తక్కువ. అలా ఉండే వారిని కూడా వీళ్ళు చెడగొడుతున్నారు. ఇక ఆ కానిస్టేబుల్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలీదు కానీ అక్కడ ఘటన చూసిన వాళ్ళు మాత్రం ఈ గమ్మత్తైన విషయం గురించే మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: