కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి య‌డ్యూర‌ప్ప రాజీనామా ప్రకటన అనంతరం ఆ రాష్ట్ర  రాజ‌కీయం రాజ్‌భ‌వ‌న్‌కు చేరుకుంది. య‌డ్యూర‌ప్ప మంత్రివర్గంలోని సీనియర్ సభ్యులు ఒక్క‌క్క‌రే అక్క‌డికి చేరుకుంటున్నారు. సీనియర్ మంత్రులు గవర్నరును కలిసేందుకు వ‌స్తుండ‌టంతో తదుపరి ముఖ్య‌మంత్రి ఎవరనేది ఆస‌క్తిక‌రంగా య‌డ్డీ బాగా ప‌నిచేశారంటూ భార‌తీయ జ‌న‌తాపార్టీ అధ్య‌క్షుడు జేపీ నడ్డా ప్రశంసించారు. ముఖ్య‌మంత్రి రాజీనామా ప్రకటన తర్వాత ఉప ముఖ్య‌మంత్రి లక్ష్మణ్ సావాడి, వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్, మరో మంత్రి జేసీ మధు రాజ్‌భ‌వ‌న్‌కు వ‌చ్చారు. బీసీ పాటిల్ సోమవారం ఉదయం య‌డ్యూర‌ప్ప‌ను క‌లిసి త‌న స‌మ‌ర్థ‌త మేర‌కే ఏ ప‌ద‌వి అప్ప‌జెప్పినా ప‌నిచేస్తాన‌న్నారు. కొద్దిరోజులుగా నాట‌కీయంగా మారిన క‌ర్ణాట‌క రాజ‌కీయానికి య‌డ్యూర‌ప్ప రాజీనామాతో తెర‌ప‌డింది. న‌లుగురు నేత‌లు రేసులు ముందున్న‌ప్ప‌టికీ ఎటువంటి అవినీతి మ‌ర‌క‌లేని ప్ర‌హ్లాద్‌జోషికి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వొచ్చ‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఆ పార్టీ అధిష్టానం ఏ నిర్ణ‌యం తీసుకుంద‌నేది మ‌రో రెండురోజుల్లో స్ప‌ష్ట‌త రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag