విశాఖ ఉక్కు క‌ర్మాగారంపై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యమై లోక్‌స‌భ‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ అడిగిన ప్ర‌శ్న‌కు  మంత్రి భ‌గ‌వ‌త్ కిష‌న్‌రావు లిఖిత‌పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చారు. విశాఖ ఉక్కుక‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై ప్ర‌భుత్వానికి రెండో ఆలోచ‌న అంటూ ఏదీ లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గ‌తంలో ఇదే ప్ర‌శ్న‌ను తెలుగుదేశం పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ అడిగిన ప్ర‌శ్న‌కు కూడా ఆయ‌న ఇదే స‌మాధానం ఇచ్చారు. ఎవ‌రెన్ని అడ్డంకులు సృష్టించినా ప్ర‌యివేటీక‌ర‌ణ విష‌యంలో వంద‌కు వంద‌శాతం ముందుకు వెళుతున్న‌ట్లు ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త‌నిచ్చింది. విశాఖ ఉక్కుక‌ర్మాగారం ఇక్క‌డి ప్ర‌జ‌ల భావోద్వేగాల‌తో ముడిప‌డిన అంశ‌మ‌ని, ఎంద‌రో ఆ క‌ర్మాగారం కోసం ప్రాణాల‌ర్పించార‌ని, దీనిపై పున‌రాలోచ‌న చేయాలంటూ పార్టీలు, ఎన్జీవోలు ప్ర‌భుత్వానికి విన్నవిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో అధికార పార్టీ జోక్యం చేసుకోవాల‌ని, క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను నిలువ‌రించాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag