తెలంగాణాలో బలపడే ఆలోచనలో ఉన్న వైఎస్ షర్మిల సిఎం కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. అవ్వ పెట్టదు..అడక్కు తిననివ్వదు అన్నట్లు ఉంది కేసీఆర్ తీరు అని ఆమె ఆరోపించారు. రాష్ట్రం లో అకాల వర్షాలకు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు. పిఎం ఫసల్ భీమా యోజన నుంచి గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుందిఅని వైఎస్ షర్మిల ఆరోపించారు.

సొంత పంటల భీమా తెస్తామని కేసీఆర్ గొప్పలు చెప్పారు అని ఇంత వరకు ఆ పాలసీ తీసుకు రాలేదు అని ఆమె మండిపడ్డారు. రైతులకు కేంద్ర భీమా వర్తించక..ఇటు రాష్ట్ర భీమా కు దిక్కులేదు అని విమర్శించారు. రైతులు కష్టాల పాలు అవుతున్నారు.. నష్టాల పాలు అవుతున్నారు అన్నారు వైఎస్ షర్మిల.

మరింత సమాచారం తెలుసుకోండి: