డోపింగ్ క‌ల‌క‌లంలో చైనా వెయిట్ లిఫ్ట‌ర్.. ఆ ఆరోప‌ణ‌లు నిజ‌మైతే ఆమెపై నిషేధం త‌ప్ప‌దు... అని అంటున్న ఒలంపిక్ వ‌ర్గాలు.. ఈ వార్త ఇండియాలో మ‌రింత ఆనందం తీసుకురానుంది. ఎందుకంటే మ‌న అమ్మాయి ర‌జ‌త ప‌త‌కం కాస్త స్వ‌ర్ణం కానుంది.. అలా ఓ అవ‌కాశం ఇప్పుడు ఊరిస్తుంది తాజాగా నెల‌కొన్న ప‌రిణామాల నేప‌థ్యంలో.. ఆ వివ‌రాలిలా ఉన్నాయి. ఒలంపిక్స్ లో ఈవెంట్స్ ప్రా రంభం అయిన రోజు వెయిట్ లిఫ్టింగ్ లో 210 కేజీలు ఎత్తి రికార్డు న‌మోదు చేసి జి హుజుయి  పై డోపింగ్ అనుమానాలు నెల‌కొ న్నాయి. ఆమెపై ప‌లు అనుమానాలు రేగుతున్నాయి. ఆమె ఎక్క‌డికీ వెళ్లేందుకు వీల్లేద‌ని త‌మ‌కు అందుబాటులో ఉండాల‌ని సం బంధిత నిర్వాహ‌కులు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆమె ఒలంపిక్ గ్రామం దాట‌లేరు. డోపింగ్ ప‌రీక్ష‌లు మ‌రో మారు నిర్వ‌హిం చా క‌నే ఆమెపై ఏదో ఒక నిర్ణ‌యం వెలువ‌రించ‌నున్నారు. ఒక‌వేళ డోపింగ్ లో ఆమె డ్ర‌గ్స్ తీసుకున్నార‌న్న‌ది నిర్థార‌ణ అయితే ఆ మెకు అందించిన స్వ‌ర్ణ ప‌త‌కం ర‌ద్దు చేసి ఆ ప‌త‌కం కాస్త మీరాబాయి చానుకు అందించ‌నున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: